ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా సమావేశం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా సమావేశం గురువారం నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణలో బాగంగా నేడు అనగా డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు జిల్లాలో ఉన్న అన్ని మండల కమిటీలు వెయ్యాలని సమావేశంలో తీర్మానం చెయ్యడం జరిగింది.అలగే పూర్తి స్థాయి జిల్లా కమిటీని కూడా వేసుకొని జిల్లాల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని తీర్మానం చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెస్ పి జాతీయ నాయకులు మనికొల్ల గంగాధర్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, సత్తెమ్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్, జిల్లా సంయుక్త కార్యదర్శి సుమన్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు భుమన్న, శ్యామ్, ఎమ్మెస్ పి టౌన్ నాయకులు శ్రీనివాస్, శ్రీ రాములు, ఎంఎంఎస్ జిల్లా కన్వీనర్ పద్మ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు సుధ, ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ మహేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్, పులెందర్ నరేష్ పోషేట్టి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love