ప్రొఫెసర్ కోదండరామ్ కు నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ సన్మానం


నవతెలంగాణ-జక్రాన్ పల్లి: ప్రొఫెసర్ కోదండరాములు నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ నాయకులు సన్మానించినట్లు జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు. ఇందల్వాయి మండల్ డొంకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్ ని నిజామాబాద్ రూరల్ యువజన విభాగం నాయకులు సన్మానించారు. వారితోపాటు డాక్టర్ భూపతి రెడ్డి, ఎంపీపీ ఉమ్మడి గోపి, రూరల్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ ఉమ్మాజీ నరేష్, జక్రన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొప్పరీ వినోద్, యూత్ నాయకులు ప్రవీణ్, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Spread the love