నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాదులో కొంత కాలం నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి.గతంలో కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.కొంత కాలం కిందట వరకు నిశ్చలంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి నాయకులు మరో పార్టీలోకి చేరిపోతున్నారు. నిజామాబాదు రాజకీయాలు రసవత్తరం గా మారుతున్నాయి.ఈ పరిణామం ఎక్కువగా కాంగ్రెస్ లో ఉంది.దీంతో పాటు ఇతర పార్టీల్లోనూ కీలకంగా ఉన్న నాయకులు ‘హస్తం’ను అందుకుంటున్నారు.తాజాగా తెలంగాణ బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న ధర్మపురి సంజయ్ సొంతగూటికి చేరిన నాటి నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి.కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. ఏది ఎలా ఉంటే ఆయనకు కాంగ్రెస్ లోనే వ్యతిరేకతలు ఆశావా హుల నుండి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.ఆయన దాదాపు మైనారిటీ వర్గాలనుండి చాలా చేరికలు తిరిగి కాంగ్రెస్ లోకి రీఎంట్రీలు జరిపించారు. ధర్మపురి సంజయ్కి జిల్లా కిలక నాయకులతో వ్యతిరేకత ఏర్పడిన జంకకుండా తన కార్యకర్తలను మళ్ళీ కాంగ్రెస్ లోకి తెస్తున్నారు.అర్బన్‌లో డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పోటీ చేస్తారని ప్రచారం ఉంది.దీన్ని ఆ పార్టీ పెద్దలే జీర్ణించుకోవడం లేదు.కానీ సంజయ్ చాపకింద నీరులా తన పార్టీ కార్యక్రమాలు,చేరికలు చేసుకుంటూ పోతున్నాడు. రేవంత్ తనకు మాటిచ్చాడని, పోటీ చేయడమే మిగిలి ఉందని, ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా పట్టించుకోబోననే మొండి పంతంతో ముందుకు పోతున్నాడు.గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలని ఆశావాహులు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నగర నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీ అధిష్టానం మాత్రం ఎట్టి పరిస్థితిలో గెల్వగల సత్తా ఉన్న రేసుగుర్రాలకే తమ టికెట్ ని ఖరారు చేయడానికి సుముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది.టీపీపీసీసీ రాష్ట్ర పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలొకి వెళ్ళాక ఆచితూచి అడుగేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రజల్లో, మైనారిటీ వర్గాల్లో డీ. శ్రీనివాస్ కి ఉన్న ఇమేజ్ వల్ల ధర్మపురి సంజయ్ కి పాపులారిటీ ఇమేజ్ పెరుగుతుందని ఆయన అనుచర వర్గాలు తెలుపుతున్నాయి.ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి తరువాత సీఎం పదవికి పోటీదారుడిగా నిలబడగలిగిన బలమై సత్తా ఉన్న నాయకుడు.ఆయన కొడుకు గా ధర్మపురి సంజయ్ కి కూడా అంత సత్తా ఉందనేది ధర్మపురి శ్రీనివాస్ అభిమానుల ఆలోచన.ప్రస్తుతం కాంగ్రెస్ కి నిజామాబాదు నియోజక వర్గానికి నగరంలో ప్రజలలో గుర్తింపు కలిగిన నాయకుడిని అధిష్టానం ఎన్నుకునే ప్రయత్నం లో ఉంది. ధర్మపురి సంజయ్ ఘర్ వాపసీ తరువాత ప్రతి డివిజన్ లో ధర్మపురి శ్రీనివాస్ వర్గీయులను ఒక్కతాటిపై తీసుకొస్తున్నారు. ఎంతో మంది మైనారిటీ కార్యకర్తలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన నిజామాబాద్ అర్బన్ నుండి కాంగ్రెస్ ధర్మపురి సంజయ్ కి టికెట్ ఖరారు అయ్యే అవకాశాలు బలంగానే ఉన్నాయి. ఈ లెక్కన అనధికారికంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించుకుని ఉంది. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప..వీరే రేపు కాంగ్రెస్ బరి నుంచి పోటీలో ఉంటారనే ప్రచారం ఊపందుకున్నది.