వధూవరులకు నిజాంపేట్ జెడ్పిటిసి పుస్తె మట్టెలు అందజేత..

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని  తాళ్ళపల్లి గ్రామానికి చెందిన మౌనిక – స్వామిలది నిరుపేద కుటుంబం. ఐతే బుధవారం వీరిద్దరి వివాహ కానున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకుని మౌనిక, స్వామి దంపతులకు  నిజాంపేట్ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ పెళ్లి పందిట్లో పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నిజాంపేట్ జెడ్పిటిసి కి వధూవరుల కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్లపూర్ తిరుపతి, నర్లాపూర్ ఉపసర్పంచ్ సంజీవ్, దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడోల్ల దేవరాజ్, పోతారెడ్డిపేట రైతు సమన్వయ కమిటీ సభ్యుడు వేల్కుల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు వేల్పుల సతీష్ మరియు  నూతన దంపతుల కుటుంబ సభ్యులున్నారు.

Spread the love