నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు నిండుకుండలాగా మారే అవకాశం ఉన్నందున బుధవారం సాయంత్రం ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదిలే అవకాశం ఉన్నదని ప్రాజెక్ట్ ఏఈఈ శివ అన్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 15.078 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.