ఎన్ఎంఐఎంఎస్ (హైదరాబాద్)లో బహుళ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తుల‌ ఆహ్వానం

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ విద్యా సంస్థ ఎస్వీకేఎం యొక్క ఎన్ఎంఐఎంఎస్లో 2023 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎన్ఎంఐఎంఎస్ నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరు కాలేని విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక ప్రవేశ ప్రక్రియను అందిస్తోంది. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 2, 2023తో ముగుస్తుంది. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు కోసం ఎన్ఎంఐఎంఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఈ ప్రత్యేక అడ్మిషన్ క్రింద ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్‌లో అందించే ప్రోగ్రామ్‌లలో బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (డేటా సైన్స్), బీ ఫార్మ్ ఉన్నాయి. + ఎంబీఏ (ఫార్మా టెక్) సమగ్ర ఐదేళ్ల ప్రోగ్రామ్,‌ విద్యార్థులకు విభిన్నమైన, ఆశాజనకమైన కెరీర్ మార్గాలను అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు జాబ్ మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా సమగ్ర జ్ఞానం, నైపుణ్యాలను పొందుతారు. బీ ఫార్మ్‌లో ఈ ప్రత్యామ్నాయ ప్రవేశాలకు అర్హత ప్రమాణాలు.. + ఎంబీఏ (ఫార్మా టెక్) ప్రోగ్రామ్‌లు 10+2లో కనీసం 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి సమానమైన పరీక్షను కలిగి ఉంటాయి. పీసీఎం/పీసీబీ ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల కోసం, పీసీఎం/వొకేషనల్ సబ్జెక్ట్‌లో కనీసం 45 శాతం లేదా చెల్లుబాటు అయ్యే ఎస్ఏటీ/ఏసీటీ స్కోర్ అవసరం లేదా అభ్యర్థి కనీసం 45‌ శాతం మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. విశ్వవిద్యాలయం సమగ్ర విద్యా విధానానికి ప్రసిద్ధి చెందింది. విద్యార్థులకు చక్కటి అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో చేరడం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత ఎదుగుదల, వృత్తిపరమైన అభివృద్ధితో పాటు వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నతంగా నిలుస్తారు. ఇది వివిధ పరిశ్రమలతో గుడ్ రిలేషన్ కలిగి ఉంది. ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. గెస్ట్ లెక్చర్స్ కోసం పరిశ్రమ నిపుణులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యం, జ్ఞానాన్ని అందించడంలో ముందుంది.

Spread the love