– కలెక్టర్ ను కలవనున్న 31 మంది కౌన్సిలర్లు
నవతెలంగాణ-సూర్యాపేట: సూర్యాపేట బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసం పెట్టడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ఇందుకుగాను కౌన్సిలర్ల సంతకాల సేకరణ చేపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు చక్రం తిప్పుతున్నట్లు గా విశ్వసనీయంగా తెలిసింది. స్వపక్షంలోనే కొందరూ విపక్షంగా మారి అవిశ్వాసానికి తెర లేపుతున్నట్లు చర్చ సాగుతోంది.ఈ నేపథ్యంలో మెజార్టీ కౌన్సిలర్లను తీసుకొని క్యాంపు కు వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలంటే 32 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది.ఇందుకుగాను 31 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పై కలెక్టర్ ను కలిసి లెటర్ ఇవ్వనున్నారని తెలిసింది.బీఆర్ఎస్ లోని కొందరు నాయకులు, కౌన్సిలర్ లే పావులు కదుపుచున్నారని తెలిసింది.50 శాతం మంది కంటే ఎక్కువ కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే అవిశ్వాసం కు ఛాన్స్ ఉంటుంది. కాగా ప్రస్తుతము బీఆర్ఎస్ కు 30 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ కు 8 మంది, బీజేపీకి 4, బిఎస్పికి నలుగురు కౌన్సిలర్లు ఉన్న విషయం తెల్సిందే. మరి ఈ నేపథ్యంలో అవిశ్వాసం పెట్టాలంటే తగినంత మెజార్టీ అవసరం ఉంటుంది. ఇందుకు తప్పనిసరిగా ప్రతి పక్ష కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అవిశ్వాసం పై మున్ముందు ఎలాoటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.