నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ శివారులో నాలుగు ఎకరాల భూమినీ కౌలుకు తీసుకొని వివిధ రకాల కూరగాయల పంటలు వేసి నా తన కుటుంబ పోషణకే సరిపోతుంది లతీఫ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకున్న పొలంలో బెండకాయ, వంకాయ, చుక్కకూర, పాలకూర, మొక్కజొన్న వివిధ రకాల పంటలు పండించినప్పటికీ, తనకు లాభం లేకుండా పోతుందాని ఆయన పేర్కొన్నారు. కౌలు పొలంలో రాత్రి పగలు పనిచేసుకుంటూ అక్కడే గడుపుతున్న ఆయనకు కుటుంబ పోసినకే సరిపోతుంది ఆయన అన్నారు. కూలీలకు పెరిగిన ధరలు, పిచ్కారి మందులు, ఎరువులతో పాటు గడ్డి తలుపు తీయడానికి తడిసి మోపెడవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో సేద తీర్చుకోవాల్సిన తనకు కష్టాలు తప్పడం లేదన్నారు. పంటలు చేతికొచ్చే లోపు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు ఫోను, తన కుటుంబం పోషణకే సరిపోతుందన్నారు. ప్రభుత్వం ఇలాంటి రైతులకు కూరగాయ రైతులకు సబ్సిడీ కింద ఆదుకున్నట్లయితే తమకు కొంతైనా లాభం చేపూరి అవకాశం ఉందని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు – లతీఫ్ (కౌలు రైతు)
గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంపై ఆధారపడిన తనకు కౌవులు భూమిలో వివిధ రకాల పంటలు పండించినప్పటికీ తన కుటుంబ పోసినకే పరిమితమవుతున్నానని, కూరగాయల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రకాలైన కూరగాయ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసినట్లయితే తమకు మరికొంత లాభం వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాత్రి పగలు వ్యవసాయ భూమి వద్దే ఉంటూ, బోరు ద్వారా వచ్చే మీటింగ్ అందిస్తూ తన జీవనాన్ని గడుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. అధికారులు నూతన సాయ వంగడాలని ఇచ్చినట్లయితే కూరగాయలను పండించి మరింత ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు.