కమిషనర్ కు, చైర్ పర్సన్ కు ఎన్నిసార్లు విన్నవించిన ప్రయోజనం లేదు

నవతెలంగాణ- ఆర్మూర్

 హరితహారం మొక్కలు అవకతవకలపై మున్సిపల్ కమిషనర్ కు చైర్పర్సన్ కు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని బిజెపి ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి అన్నారు.. సోమవారం మున్సిపల్ కౌన్సిల్  సమావేశంలో 18 అంశాలతో తీర్మానం ప్రవేశపెట్టార నీ ,మూడు సప్లమెంటరీ అంశాలను కూడా పొందుపరిచారు అని ఆదివారం ఈ అంశాలపై బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం కు వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అని అన్నారు .ఏదైతే హరితహారం మొక్కలు ఉన్నాయో వాటిపై అవకతవకలు ఉన్నాయి కమిషనర్ను మరియు చైర్ పర్సన్ ను ఎన్నోసార్లు విన్నవించిన ప్రయోజనం లేదు ఏదైతే ఆ మొక్కలపై అంశంలో 40 లక్షల రూపాయలతోని ఈత మొక్కలు నాటాలని ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని ఏకగ్రీవంగా అందరూ అడ్డు చెప్పడం వల్ల రద్దు చేయడం జరిగింది మరియు మోటార్లకు రిపేర్లు అని చెప్పి పది లక్షల రూపాయలకు పెట్టిన అంశాన్ని అందరూ వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం కమిటీలు వేసి వాటి బిల్లులను పరీక్షించి తర్వాతనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.. అందులో కూడా అవకతవకలు ఉన్నాయి ఇలా అనేక అంశాలపై అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ కమిషనర్ ఈ చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంగ వ్యతిరేకించడం జరిగింది. అని అన్నారు ఏదైతే కుక్కల బెడదల గురించి మాట్లాడితే కలెక్టర్ కు అప్లికేషన్ ఇచ్చినము కలెక్టర్ అనుమతి తర్వాతనే వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే గణేష్ పండుగకు జరిగే రోడ్లకు మరమ్మత్తుల కోసం కేటాయించినటి అంశంలో ఇప్పటివరకు మొరం వెయ్యలేదు ఇప్పుడు మేము రేపటి నుంచి మొరం వేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇలాగ ప్రతి ఒక్కటి అవినీతికి పాల్పడే అంశాలపై వీరు దాటి వేస్తున్నారు మంచినీటి నల్లలపై బిల్లులు వసూలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు ప్రజలు నుంచి బిల్లు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ముక్తకఠంగా వ్యతిరేకించినాము కమిషనర్ కూడా నల్ల బిల్లులు వసూలు చేయట్లేదు అని చెప్పారు కావున ప్రజలు ఎవరు కూడా నల్ల బిల్లులు కట్టవద్దని అన్నారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయికుమార్ ,,పాలెపు లత రాజు ,,ఆకుల సంగీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love