నవతెలంగాణ – చివ్వేంల
చివ్వేంల మండలకేంద్రంలోని వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో మాజీ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకులు కుందూరు జానారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాం రెడ్డి దామోదర్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కెసిఆర్, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి మరియు అనుచరులు ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ మాఫియాగా ఏర్పడి అరాచకం సృష్టించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలందరూ తిరగబడి కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన విధంగానే, కుల మతపరంగా విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే నరేంద్ర మోడీ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో, దామోదర్ రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట ప్రాంతానికి తాగునీటి సౌకర్యం కల్పించామని, కానీ జగదీశ్ రెడ్డి సూర్యాపేట ప్రాంతం తన హయాంలోనే సస్యశ్యామలం చేశామనడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రంలో సూర్యాపేటలో బి ఆర్ఎస్ పార్టీ బలహీన పడిందిని అన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ తమ రహస్య ఎజెండాతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి హాని తల పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య హక్కులు, స్వేచ్ఛ కోల్పోవాల్సి వస్తుందన్నారు.13 రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి సూర్యాపేట నియోజకవర్గంలో రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.