మల్లు రవి గెలుపును ఎవరు అడ్డుకోలేరు 

– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ 
– ఆమనగల్ కార్నర్ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రముఖులు 
నవతెలంగాణ – ఆమనగల్ 
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు గా డాక్టర్ మల్లు రవి గెలుపును ఎవరు అడ్డుకోలేరని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఆమనగల్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పలువురు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి భారి విజయాన్ని అందించిన ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులుగా డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను వేడుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా పంపించాలని ఆయన అన్నారు. ఈసమావేశంలో  డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గుర్రం కేశవులు, ఎగిరిశెట్టి సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు ఖలీల్, రమణారెడ్డి, మండల అధ్యక్షులు తెల్గమల్ల జగన్, బిచ్యా నాయక్, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, మాజీ మండల అధ్యక్షులు మండ్లి రాములు, నాయకులు కాలే మల్లయ్య, గండికోట మల్లేష్, రవీందర్ నాయక్, కృష్ణ నాయక్, వస్పుల శ్రీశైలం, అలీం, మెకానిక్ బాబా, ఖాదర్, ఫరీద్, వస్పుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love