యువకుడిపై థర్డ్‌ డిగ్రీ.. ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

నవతెలంగాణ – విశాఖపట్నం: పద్మనాభం పోలీస్‌ స్టేషన్‌లో యువకుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ సీపీ రవి శంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి పద్మనాభం మండలంలో బాందేవుపురం గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీసులు థర్ద్‌ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి మరీ కాళ్లు విరగొట్టారని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆందోళన సైతం చేపట్టింది. ఈ విషయం సీపీ రవిశంకర్‌ దృష్టికి రావడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love