– ఆయకట్టు రైతులు ఆగం
– కార్తెలు కరిగినా కరుణించని కరునుడు
– తుకాలు పోసి ఎదురుచూస్తున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
చెరువులు, కుంటల్లో నీటి జాడ కరువైoది.జలాశయంలో నీరు లేకపోవడంతో పంటలు సాగు చేపట్టిన రైతులు తలలు పట్టుకున్నారు.వర్షం కురిస్తే దున్నకాలు చేపడుదామని అన్ని సిద్ధం చేసుకున్నారు. ముందు మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేయడంతో ఇప్పటి వరకు వరినాట్లు ప్రారంభించలేదు. తుకం పోసి చినుకు కోసం ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. మండలంలో 15 గ్రామాల్లో చెరువులు, కుంటలు మొత్తం 832 ఉన్నాయి.అలాగే కాపురం గ్రామంలో కాపురం చెరువు,ఎడ్లపల్లి గ్రామంలో బొగ్గుల వాగు ప్రాజెక్టు,రుద్రారం ఉర చెరువు,తాడిచెర్ల ఉర చెరువు, పెద్దతూoడ్ల ఉర చెరువు తదితర చిన్నతరహా ప్రాజెక్టులు ఉన్నాయి.గతేడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు,కుంటలు,ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఆరుద్ర కార్తెలోనే నాట్లు వేసే పనులు ముమ్మరంగా కొనసాగాయి.కానీ ఈసారి రోణి కార్తెలో వర్షాలు కురవడంతో రైతులు ముందుగానే పత్తి పంటను సాగు చేశారు. వరి నారుకు మృగశిర, ఆరుద్ర కార్తెలో తుకం పోశారు.తుకం మొలిచి నాటుకు సిద్దమవుతున్న వర్షాలు కురువకపోవడంతో ఆయకట్టు రైతులు దుక్కి దున్నకుండా చినుకు కోసం ఎదురుచూస్తున్నారు.బోరు బావుల్లో నీటిశాతం తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని గ్రామాల్లో తేలికపాటి, మరి కొన్ని గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిచి ఎక్కడ ఇంకా భారీ వర్షాలు కురవకపోడంతో ఈ సారి వ్యవసాయం కష్టమే అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.పత్తి పంట రక్షణ కోసం బోర్ బావులు ఉన్న రైతుల వద్ద నుంచి తడులు కడుతున్నారు. మండలంలో 15,500 వేల ఎకరాలకు పైగా వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
వేలవేల బోతున్న చెరువులు…
వర్షాలు సకాలంలో ఉండకపోవడంతో మండలంలోని చెరువులు, కుంటలు,ప్రాజెక్టులు వేలవేలబోతున్నాయి. కాపురం చెరువులో నీరు లేక నెర్రెలు బారింది. గ్రామాల్లో ఉర చెరువుల పరిస్థితి ఇదే. నీరు లేక గ్రామాల్లో చెరువులు, కుంటలు బోసిపోతున్నాయి. ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు చెరువులు,కుంటలు నిండితేనే వరి సాగు చేస్తారు. కానీ వర్షాలు లేక తుకాలు పోసి వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
వానొస్తేనే దున్నకాలు; లక్ష్మన్ రైతు
కాపురం చెరువు ఆయకట్టు కింద రెండెకరాల పొలం ఉంది.గత 20 రోజుల క్రితమే తుకం పోశాను.కానీ ఇప్పటి వరకు బారి వర్షం కురియకపోవడంతో పొలం దున్నలేదు.వానలొస్తేనే దున్నడమవుతుంది.వర్షాలు ఇలాగే ఉంటే పోసిన తుకం ముదిరిపోతుంది.