– ఎంపీడీఓతో ఉపాధి కూలీల వేడుకోలు
– బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్
– అనుసంధానం చేయాలి
– ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ క్రాంతికిరణ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎర్రటి ఎండలో పని చేస్తున్నం. పైసలేవి సారు. పని మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు. ముందు పైసలు ఇప్పించరూ’ అని ఉపధిహామీ కూలీలు కోరారు. పైసలు ఇస్తేనే తమ పొట్టగడుస్తుందని కోరారు. ఉపాధిహామీ పనుల తనిఖీలో భాగంగా రాయ పోల్, ముకునూర్ గ్రామాల్లో ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ క్రాంతికిరణ్ పర్యటించారు. కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓతో కూలీలు కూలీ డబ్బులు రావడం లేదని మొరపెట్టుకున్నారు. పనులు చేసి పస్తులుండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేసినా డబ్బులు రాకపోవడానికి గల కారణాలను ఉపాధి హామీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పని చేసిన తా మందరికీ డబ్బు రావడం లేదన్నారు. కేవలం కొందరికి మాత్రమే డబ్బులు పడుతున్నాయన్నారు. బ్యాంకు అకౌంట్ల కు ఆధార్ అనుసంధానం చేయకపోవడం వల్లనే కూలీలు ఖాతాల్లో పడటం లేదని సిబ్బంది తెలిపారు. దాంతో ప్రతి ఉపాధి కూలీ తప్పకుండా తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలన్నారు. అంతే కాకుండా ఎండలు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూలీలు ఉద యం 6 గంటలకే పనిలోకి వచ్చి చేసుకోవాలన్నారు. ఎం డల పెరిగే సమయంలో విశ్రాంతి తీసుకోవాలని కోరారు. పని ప్రదేశంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండేవిధంగా తగుచ ర్యలు తీసుకోవాలని ఏపీఓ తిరుపతాచారీకి సూచించారు. మండలంలో కొనసాగుతున్న పనులను ఏపీఓ, ఈసీ వేరు వేరుగా గ్రామాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు. ప్రతి కూలీకీ కనీస వేతనం రూ.272 అందే విధంగా కొలతలపైన కూలీలకు ఆవగాహన కల్పిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో ముకునూర్, రాయపోల్ గ్రా మాల సర్పంచ్‌లు శివరాల జ్యోతి, బల్వంత్ రెడ్డి, ఏపీఓ తి రుపతిచారి, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శులు చిట్టమ య్య, దాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.