భువనగిరిలో త్రిబుల్ ఆర్ బాధితుల నామినేషన్ …..

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం

నవతెలంగాణ భువనగిరి రూరల్: భువనగిరి నియోజకవర్గంలో త్రిబుల్ ఆర్ బాధితుడు ఆవిశెట్టి పాండు యాదవ్ మొదటి నామినేషన్ శనివారం దాఖలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ట్రిబుల్ ఆర్ బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురవుతుంది. ఈ మధ్యన ఆయన కూతురు, మామలు రాయగిరి, బాలంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా వారిని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉదియుక్త పరిస్థితులు నెలకొ న్నాయి. రాయగిరి గ్రామం నుంచి త్రిబుల్ ఆర్ బాధితులు ఇంకా కొంతమంది సైతం నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. భువనగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రెండు సెట్ల నామి నేషన్ పత్రాలను దాఖలు చేశారు. శివసేన మద్దతుతో తెలంగాణ పునర్నిర్మాణ సమితి పార్టీ పేరుతో పూస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పూస శ్రీనివాస్ అర్ద నగ్న ప్రదర్శనతో రిక్షాలో నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఆలేరు నియోజకవర్గం నుంచి విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున బుగ్గ శ్రీకాంత్ నామినే షన్ దాఖలు చేశారు.

Spread the love