ఆగని అక్రమ ఇసుక రవాణా..

నవతెలంగాణ – ఉప్పునుంతల
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వాల్టా చట్టవ్యతిరేకమైన కార్యకాపాలు కొనసాగిస్తున్నారు. కొందరు అక్రమార్కులు యాల పాల లేకుండా, పర్మిషన్ లేదు అంతేకాకుండా ఓవర్ స్పీడ్ తో ట్రాక్టర్ వెళ్తుంటే రోడ్డుపై వెళ్లే రైతులు, వాహనదారులు భయబ్రాంతులకు గురైతున్నామని వాపోతున్నారు. ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ గేటు సమీపంలో ఆదివారం డ్రైవర్ అతి వేగంతో ట్రాక్టర్ నడుపడంతో అది చూసిన స్థానికులు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే రైతులకు,వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను అరికట్టాలని డిమాండ్ చేశారు.

Spread the love