అరెస్టు అయిన వారిలో రైతులు ఎవరూ లేరు..

నవతెలంగాణ – భువనగిరి రూరల్
త్రిబుల్ ఆర్ ధర్నా కేసులో అరెస్ట్ అయిన వారిలో రైతులు ఎవరూ లేరని రాచకొండ కమిషనరేట్ భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం డిసిపి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. భువనగిరి కోర్టు ముందు త్రిబుల్ ఆర్ కేసులో ఉన్న నలుగురు నిందితులను బేడీలతో తీసుకురావడంపై వస్తున్న అభ్యంతరాల గురించి యాదాద్రి భువనగిరి పోలీసులు వివరణ ఇచ్చారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. సహజంగా నేరస్తుల ప్రవర్తన బట్టి వారిని ఎంత బందోబస్తు నడుమ తీసుకు వెళ్లాల్సి వస్తుందో నిర్ణయించబడుతుందని, ఆ నలుగురు గతంలో అరెస్టు సమయంలోనే పోలీసులను తోయడం, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, కలెక్టర్ ఆఫీసు లోపలికి వెళ్లి నిప్పు పెట్టి ధ్వంసం చేయడం వలన వీరిని అరెస్టుచేయడం జరిగిందనారు. అరెస్టు అయిన వారిలో రైతులు ఎవరూ లేరని, అందులో జమ్మాపూర్ మట్రిక్స్ కంపెనీలో పని చేసే వ్యక్తికి మాత్రం 20 గుంటల భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఒక ఆరుగురితో కలిసి కొనడం జరిగిందని, ఆ 20 గుంటలలో కొంత పోతున్నది మాకు ప్రాదమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. వీరిని కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో పోలీసు యొక్క రెగ్యులర్ ప్రోటోకాల్ భాగంగానే వీరిని తీసుకొచ్చామని, కోర్టుకు తీసుకోచే సమయంలో ఎస్కార్ట్ పార్టీ ని కూడా ఇబ్బంది పెట్టినట్టు తెలిసిందని, మీడియా లో వస్తున్నా అబ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు లో ఉన్న పోలీసు ఇంఛార్జు పై క్రమశిక్షణ చర్య తీస్కోవడం జరిగిందనారు.

Spread the love