అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ..

నవతెలంగాణ -శంకరపట్నం
అంబులెన్స్ లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మమత పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల కేంద్రము లో ని కేశవపట్నం గ్రామానికి చెందిన గోదారి మమత (24 ) కు గురువారం పురిటి నొప్పులు వస్తుండగా కుటుంబ సభ్యులు 108 కు కాల్ చేశారు.వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ సదన్ రెడ్డి,లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మమతను అంబులెన్స్ లోనికి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి సతీష్ రెడ్డి, ఏ ఆర్ సి పి డాక్టర్ గోపీనాథ్, సలహాల మేరకు మమతకు నార్మల్ డెలివరీ చేసి తల్లి బిడ్డను సురక్షితంగా హాస్పటల్ కు తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బందిని ఈఎంటి సతీష్ రెడ్డి, మరియు పైలట్ సదన్ రెడ్డి,లను మమత కుటుంబ సభ్యులు అభినందించారు.

Spread the love