తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉత్తర తెలంగాణ క్లాసులు ఈనెల 23, 24, 25 తేదీలలో (కామ్రేడ్ నామ్ శంకర్ నగర్ లో)బస్వాగార్డెన్ లో జరుపుకున్నాం. 25వ తేదీన క్లాసులు ముగించుకున్నాం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు శుక్రవారం తెలిపారు. ఈ క్లాసులకు ఉత్తర తెలంగాణ పది జిల్లాలకు గాను 8 జిల్లాల నుండి వంద మంది పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్లాసులలో మొదటి క్లాసు పెద్ది వెంకట్రాములు గారు శాస్త్రీయ ఆలోచన సబ్జెక్టును బోధించారు. లంక రాఘవులు వివిధ రాజకీయ పార్టీలు వైఖరి – వ్యవసాయ కార్మికుల పైన ప్రభావం అనే సబ్జెక్టుని బోధించారు. మూడవ క్లాసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు దేశంలో వ్యవసాయ కార్మికుల స్థితిగతులు- పరిష్కారాలు బోధించారు. నాల్గవ క్లాసు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ సంఘం నిర్మాణం – భవిష్యత్తు కర్తవ్యాలు బోధించారు. అలాగే ఈ క్లాసులకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు రమేష్ బాబు ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులను బోధించారు. ఈ క్లాసులకు నిజామాబాద్ జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆతిథ్యం ఇచ్చింది.ఈ క్లాసులకు దుర్గం నూతన్ కుమార్ గారు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు గారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా పక్కకు పెట్టి దేశంలో మతోన్మాద రాజకీయాలు, దళితులు, మహిళలపై దాడులను ప్రోత్సహిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో జాతి అహంకార దాడులకు తెర లేపారు. కులపిచ్చులు దేశం అంతా విస్తరిస్తున్నాయి. మనువాధాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి దేశ విచ్చిన్న కారులైన మనువాదులను దేశం నుంచి తరిమి వేయాలని, వచ్చే ఎన్నికల్లో ఆ లక్ష్యంతో 70% గా ఉన్న వ్యవసాయ కార్మికుల పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కకు పెట్టింది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్రూమ్ ఇల్లుల పంపిణీ జరగటం లేదు. రేషన్ కార్డులు 2016లో అక్రమంగా తొలగించారు. ఆ స్థానంలో వారికి మళ్ళీ ఇవ్వడానికి,కొత్త వారికి ఇవ్వాలనే కనీసం ఆలోచన చేయడం లేదు. పేదవారికి, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారు. అది పక్కకు పెట్టి భూకబ్జాలు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను వందల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ప్రజలకు మాత్రం పంచట్లేదు. నామవాత్రంగానే పంచినారు. ఇల్లు ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్లకు ఇల్లు నిర్మించుకోవటానికి గృహలక్ష్మి పథకం 3 లక్షల రూపాయలు సరిపోదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 58 GO ప్రకారం గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవారికి ఇండ్ల స్థలం ఇచ్చి పట్టాలి ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రుణం కూడా అందించాలి. వ్యవసాయ కూలీల సమస్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆయా పార్టీలు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాలక పార్టీలకు, విపక్ష పార్టీలకు హెచ్చరిక చేశారు. అలాగే పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్రాంత పోరాటం చేసి ఉపాధి హామీ పథకాన్ని మరింత పెంచుకోవాలని, పట్టణాలకు పక్కన ఉన్న గ్రామాలను పట్టణాలలో చేర్పించడం వల్ల వారికి పని లేకుండా పోయింది. కాబట్టి పట్టణ ఉపాధి పథకం కూడా అమలు చేయాలని, కూలీబందు పథకాన్ని అమలు చేయాలని, లేనిచో పేద ప్రజలందరూ ఏకమై ఎన్నికల్లో ఓడించేందుకు వెనకాడరని హెచ్చరించారు. ఈ క్లాసులలో సీనియర్ నాయకులు జగిత్యాల కార్యదర్శి భూతం సారంగపాణి, మంచిర్యాల అశోక్, కరీంనగర్ రాజు, శ్రీనివాస్, డాకూర్ తిరుపతి, శారద, బాబు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఉత్తర తెలంగాణ తరగతులు..
నవతెలంగాణ- కంటేశ్వర్