విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ, ”థాంక్యూ బ్రదర్’ సినిమాను అందరూ ఆదరించారు. ఇది మా రెండో సినిమా. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉండదు’ అని తెలిపారు. డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ, ‘ఇదొక సెల్ ఫోన్ కథ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పాటలు, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. పాయల్ అందరి గుండెల్ని కొల్లగొడుతుంది’ అని అన్నారు. ‘నా మనసుకు నచ్చిన పాత్ర చేశా. ఆడియెన్స్‌కు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. సురేష్ కెమెరా వర్క్ బాగుంటుంది. శ్యామల, సునీల్ కాంబినేషన్ అందరినీ నవ్విస్తుంది. పాయల్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని హీరో విరాజ్ అశ్విన్ చెప్పారు.