కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కష్ణ దర్శకుడు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రానికి రింకు కుక్రెజ సహ నిర్మాత. ఈనెల 6న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా నాయిక నేహాశెట్టి మీడియాతో మాట్లాడుతూ, ”డీజే టిల్లు’ సక్సెస్ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీగా ఉంది. ఇందులో నేను సన పాత్ర చేశాను. అయితే ‘డీజే టిల్లు’లో రాధికలాగా ఇది స్వార్థపూరిత పాత్ర కాదు. తిరుపతికి చెందిన అమ్మాయి. చాలా సాహసవంతురాలు. ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటుంది. చాలా గ్లామర్‌గా ఉంటుంది. భిన్నంగా ఉండే ఈ కథలో సంఘర్షణ, కామెడీ ఉంది. కానీ రొటీన్ అబ్బాయి-అమ్మాయిల కథ కాదు. ఇదొక ఆకర్షణీయమైన లవ్ థీమ్‌తో ఉంటుంది. కిరణ్ అబ్బవరం మంచి కోస్టార్. దర్శకుడు రత్నం కృష్ణకు మంచి క్లారిటీ ఉంది. సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’
అని చెప్పారు.