– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సీఎంకు లేఖ
నవతెళంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం జరుగుతున్నదనీ, సత్వరం వారికి న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణకు చెందిన హైదరాబాద్ రేంజ్(మల్టిజోన్ 2) నుంచి 434 మంది, వరంగల్ రేంజ్ (మల్టిజోన్ 1) నుంచి 150 మంది ఎస్ఐ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. వరంగల్ రేంజ్‌కు చెందిన 150 మంది, హైదరాబాద్ రేంజ్‌కు చెందిన 220 మంది ఇప్పటి వరకు ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందారని తెలిపారు. 2012 సంవత్సరంలో ఎస్ఐలుగా ఉద్యోగాలు పొందిన 40 మంది కూడా పదోన్నతి పొందారని పేర్కొన్నారు. కానీ.. 2009 బ్యాచ్‌కు చెందిన మిగిలిన 214 మందికి మాత్రం ఇప్ప టివరకు ప్రమోషన్ ఇవ్వ కుండా అన్యాయం జరిగిందని తెలిపారు. దీంతో సొంత బ్యాచ్‌కు చెందిన మిత్రులు, జూనియర్లు వీరికి పై అధికారులయ్యారని పేర్కొన్నారు. ఇది 214 మంది ఆత్మగౌరవ సమస్యగా మారి, మానసిక ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. వీరికి వెంటనే న్యాయం చేయాలని కోరారు.