పంత్‌పై వేటు

పంత్‌పై వేటు– ఆర్సీబీతో మ్యాచ్‌కు దూరం
ముంబయి : ఓ వైపు ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌పై వేటు పడింది. ఈ సీజన్లో మూడు మ్యాచుల్లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా పంత్‌ జరిమానాకు గురయ్యాడు. రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లోనూ స్లో ఓవర్‌ రేట్‌తో పంత్‌పై మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. మూడు సార్లు స్లో ఓవర్‌రేట్‌కు గురైతే కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం విధిస్తారు. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్‌ అప్పీల్‌కు వెళ్లినా మ్యాచ్‌ రిఫరీ నిర్ణయాన్నే బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ సమర్థించాడు. దీంతో నేడు చిన్నస్వామిలో ఆర్సీబీతో మ్యాచ్‌లో క్యాపిటల్స్‌కు అక్షర్‌ పటేల్‌ సారథ్యం వహించనున్నాడు.

Spread the love