నటి హేమకు మళ్లీ నోటీసులు..

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్‌ సినీ నటి హేమకు మరో ఊహించని షాక్‌ తగిలింది. సినీ నటి హేమకు మరోసారి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు సినీ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27 వ తేదీన విచారణకు రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చారు. తనకు జ్వరంగా ఉందని విచారణకు రాలేనని బెంగళూరు పోలీసులకు చెప్పారు హేమ. దీంతో మరోసారి విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న సిసిబీ మరోసారి నోటీసులు ఇచ్చారు.

Spread the love