డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!

నవతెలంగా-హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయిన కబాలి నిర్మాత కేపీ చౌదరి.. పలువురు సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్‌ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడంతో ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. కేపీ చౌదరి దందా, డ్రగ్స్‌ కొన్నవారి జాబితా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్‌ సంభాషణలు, వాట్సాప్‌ చాటింగ్‌లు, డ్రగ్స్‌ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుచుకోగా.. వాటిని పోలీసులు వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈనెల 14న కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్‌ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించానని పోలీసులకు చెప్పారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల  కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Spread the love