1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో ఈ మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్‌, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు (తెలంగాణ వైద్యసేవల నియామక మండలి) ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్‌ ఎష్ట్రరతీb.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు ఆ నోటిఫికేషన్‌ లో పేర్కొంది.
వైద్యారోగ్యశాఖలో జాబ్‌ మేళా
వైద్యారోగ్యశాఖలో జాబ్‌ మేళా కొనసాగుతున్నదని ఆ శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇప్పటికే స్టాఫ్‌ నర్సుల నియామకాల కోసం పరీక్ష నిర్వహించనున్న బోర్డు తాజాగా ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిందంటూ ట్వీట్‌ చేశారు.

Spread the love