నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో ఆరోగ్య శాఖలో 2,050 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి వైద్యారోగ్య సేవల నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డీహెచ్, డీఎంఇ, కుటుంబ సంక్షేమ విభాగంలో 1,576, టీవీవీపీలో 332, ఆయుష్‌లో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 80, ఐపీఎంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల్లో మార్పులు ఉండొచ్చనీ, ఖాళీలు పెరిగితే వాటిని జోడించడం, తగ్గించడం చేయొచ్చని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హులైన వారు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 16న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశమిచ్చారు. నవంబర్ 17న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
టీఎన్‌ఎ హర్షం
నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పట్ల తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ (టీఎన్‌ఎ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపింది.