త్వరలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : మంత్రి

నవతెలంగాణ- హైదరాబాద్:  విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. TSSPDCLలో కొత్తగా రిక్రూట్ అయిన 1,362 మంది లైన్ మెన్ లకు నిన్న హైదరాబాదులో నియామక పత్రాలు అందజేస్తారు. తమ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థల్లో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అదే విద్యుత్ రంగం సాధించిన విజయాలతోటే ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తెలంగాణా కు తరలి వస్తున్నారన్నారు. కను రెప్ప కొట్టినంత సేపు కుడా విద్యుత్ కొరత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే నన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది కేవలం ఆరు గంటలేనని ఆయన ఎద్దేవాచేశారు.

Spread the love