నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ఐంది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో తెలంగాణలోని ఒక స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. దింతో తెలంగాణలోని ఒక స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొంది ఎన్నికల సంఘం. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని వెల్లడించింది ఎన్నికల సంఘం.