నవతెలంగాణ – నవీపేట్: గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిపి కార్యదర్శి రవీందర్ నాయక్ కు జిపి కార్మికులు శుక్రవారం సమ్మె నోటీసును అందజేశారు. తమ సమస్యల డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ 25 నుండి సమ్మె ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ జేపీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు పండగ సెలవులు, జాతీయ అంతర్జాతీయ సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మేకల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బద్యం పోశెట్టి, దేవకి, భోజన్న, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.