ఎన్.పీ.ఏ – 2024 ప్రతిపాదిత  జాబితాలో అశ్వారావుపేట కు స్థానం..

– స్వయం సమృద్ధిలో భద్రాచలం, మందలపల్లి తో పోటీ పడిన పంచాయితీ..
– మంచి పాలన అంశంలో పేటకు  అవకాశం..
నవతెలంగాణ – అశ్వారావుపేట 
కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా పంచాయితీలకు అందజేసే జాతీయ పంచాయితీ అవార్డ్ – 2024 ప్రతిపాదిత జాబితాలో నియోజక వర్గం,మండల కేంద్రం అయిన  అశ్వారావుపేట మేజర్ పంచాయితీకి  స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 22 అంశాల ప్రమాణాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 9 పంచాయితీలు ను  9 అంశాల ప్రమాణాల్లో ప్రతిపాదించగా ఆరో అంశం అయిన స్వయం సమృద్ధి మౌళిక వసతులు కల్పన తో “పంచాయితీలో మంచి పాలన” అంశంలో జిల్లా లోని రెండో పెద్ద పట్టణం,దైవ క్షేత్రం అయిన భద్రాచలం,అశ్వారావుపేట నియోజక వర్గం లోని మందలపల్లి పంచాయితీల తో పోటీ పడి జాతీయ స్థాయి పంచాయితీ అవార్డ్ ఎంపిక ప్రతిపాదిత జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం 29 ప్రభుత్వ శాఖలు నుండి ప్రతిపాదిత పంచాయితీల పాలన విధానాలను, ప్రజలకు కల్పించే సౌకర్యాలను, పంచాయితీకి లభించే వనరులను అంచనా వేస్తారు. 9 అంశాలను 29 ప్రభుత్వ శాఖల ద్వారా పనితనాన్ని గుర్తించడానికి మొత్తం 586 ప్రశ్నలతో కూడిన నివేదికను రూపొందిస్తారు.మంచి పాలనలో పంచాయితీ అనే ఆరో అంశం లో 135 ప్రశ్నలతో కూడిన నివేదిక ఆధారంగా జాతీయ పంచాయితీ అవార్డు – 2024 కు ప్రతిపాదించారు.

ప్రభుత్వ నిధులతో పాటు విరాళాలతో అదనపు పౌరసేవలను అందిస్తున్నాం : ఈ ఓ హరిక్రిష్ణ, అశ్వారావుపేట

పంచాయితీ పరిధిలోని దాతలు, పరిశ్రమల యజమానులు సహాయ సహా కారాలు తో సుమారు రూ.15 లక్షల విరాళాలు తో ట్రాక్టర్, ట్రక్ కొనుగోలు తో పాటు వైకుంట ధామం అభివృద్ది చేసాం. పంచాయితీ నిధులతో 72 సీసీ రోడ్ లు,12 కల్వర్టులు,1000 మీటర్లు సైడ్ డ్రైన్ నిర్మాణం. తడి, పొడి చెత్త సేకరణ కోసం 4 సూపర్ క్యారియర్ వ్యాన్ లు కొనుగోలు. గ్రామం మొత్తానికి సురక్షిత మంచినీటి సరఫరా, పట్టణంలోని ప్రతీ వీధిలో ఎల్ఈడీ లైటింగ్ తో వీధి వెలుగులు. పౌర సేవలు అన్నీ పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా అందజేస్తాం. కార్యాలయంలో కంప్యూటర్,స్కానర్,ప్రింటర్ తో పాటు వైఫై సౌకర్యం. పంచాయితీ లోని 12 దళిత, గిరిజన,బీసీ మైనార్టీ వసతి గృహాలు,9 ప్రాధమిక పాఠశాలలు,2 ఉన్నత పాఠశాలలు,6 కళాశాలలు  అన్నిరకాల మౌళిక సదుపాయాలు అందుబాటులో ప్రజా రవాణా కు బస్ స్టాండ్, సామాజిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రం, గృహ అవసరాలు కోసం నిరంతర విద్యుత్ సౌకర్యం. పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామంలో అధునాతన సౌకర్యాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ. 3 కోట్లు తో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
Spread the love