ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి విస్త్రుత తనిఖీలు..

– సబ్ స్టేషన్ లు, విద్యుత్ లైన్ లు సునిశిత పరిశీలన..
– నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రణాళికలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట 
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే.వరుణ్ రెడ్డి అశ్వారావుపేట నియోజక వర్గం లోని,రెండు మండలాల్లో గల సంస్థ సబ్ డివిజన్ లో మూడు సెక్షన్ లలో మంగళవారం విస్త్రుత పర్యటన చేసారు. ఇందులో దమ్మపేట మండలం గండుగులపల్లి, అంకం పాలెం,పట్వారిగూడెం,మల్కారం,అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట,నారంవారిగూడెం,అచ్యుతాపురం సబ్ స్టేషన్ లు పరిధిలోని 11 కేవీ విద్యుత్ లైన్ లు,33 కేవీ సబ్ స్టేషన్ లు వీటి పరిధిలోని ట్రాన్స్ఫార్మర్స్ లు తనిఖీ చేసారు. విస్తారంగా ఉన్న ఆయిల్ ఫాం క్షేత్రాల్లో గల విద్యుత్ లైన్ తో తరుచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం నివారణకు ఏమేమీ చర్యలు తీసుకో వచ్చో స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కార్పోరేషన్ వరంగల్ ఏడీ (టెక్నికల్) హుస్సేన్,ఎం.ఆర్.టీ డీఈ రమేష్,ఎన్పీడీసీఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్.ఈ కే.రమేష్,ఎస్.ఏ.ఓ ఈ.మురళి,కొత్తగూడెం,పాల్వంచ,భద్రాచలం డీ.ఈ లు నందు,జస్వంత్,అశ్వారావుపేట ఏడీఈ బి.వెంకటేశ్వరరావు,ఏఈ లు మహేష్,శరత్,సంతోష్,సాయి లు ఉన్నారు.
Spread the love