ఇంటిగ్రేటెడ్ చదువుతున్న విద్యార్థులకు తక్షణమే డిగ్రీ మెమొలు ఇవ్వాలి: ఎన్ఎస్ యుఐ

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని  ఇంటిగ్రేటెడ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు వారి డిగ్రీ మెమోలు ఆపడం సమంజసం కాదని, వెంటనే మెమోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లోని పారిపలన భవనం లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ యుఐ) ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి మెమోలు , ఇతర సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు కొమిర శ్రీ శైలం మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు వారి డిగ్రీ మెమోలను ఆపడం సమంజసం కాదన్నారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడినందున వారి డిగ్రీ మెమోలు డిగ్రీ అయిపోయిన విద్యార్థుల మెమొలు వారివి వాళ్లకు ఇవ్వాలని, అదేవిధంగా గతంలో జరిగినటువంటి లేడ్జార్ బుక్కులో విద్యార్థులపై అక్రమంగా వేసినటువంటి బిల్లులను తక్షణమే తొలగించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు విద్యార్థులంతా అధిక సంఖ్యలో వెళ్లి వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ ఉపాధ్యక్షుడు మహేష్,కార్యదర్శి బాణోత్ సాగర్ నాయక్, విద్యార్థులు నవీన్, లక్ష్మణ్, వినయ్, నితీష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love