నవతెలంగాణ – అశ్వారావుపేట
నట సార్వభౌమ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు ఆదివారం తెలుగుదేశం నియోజక వర్గం ఇంచార్జి కట్రం స్వామి దొర నేతృత్వం అశ్వారావుపేట లోను నిర్వహించారు. కాగా పూర్వం తెదేపా లో పని చేసిన ప్రస్తుత బీఆర్ఎస్,కాంగ్రెస్ లోని ఎన్.టి.ఆర్ సామాజిక వర్గం నాయకులు హాజరు కావడం గమనార్హం. అయితే తెదేపా నుండి ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులు గతంలో ఎన్టీఆర్ జయంతి,వర్ధంతి కి పాల్గొన్న దాఖలాలు లేవు.కానీ శతజయంతి ఉత్సవాలు పేరుతో ఆ సామాజిక వర్గం ఒక్కటవ్వడం హర్షఇంచతగ్గా విషయం. మూడు రోడ్ల కూడలిలో గల ఆయన విగ్రహానికి పూర్వ తెదేపా నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుంకవల్లి వీరభద్రరావు, ప్రస్తుత బిఆర్ఎస్ మండలాధ్యక్షులు బండి పుల్లారావు, కమ్మ సంఘం అశ్వారావుపేట మండల అధ్యక్షులు సంకురాత్రి సతీష్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ కళా, రాజకీయ రంగాల్లో ఆయన అందించిన సేవలను కొనియాడారు. అనంతరం కమ్మ సంఘం ఆధ్వర్యంలో 300 మందికి పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, తలసిల ప్రసాద్, ఆండ్ర ప్రసాద్, తలసిల బాలక్రిష్ణ, కాకర్ల వెంకటేశ్వరరావు, నెక్కంటి ప్రసాద్, అల్లూరి బుజ్జి, తాడేపల్లి రవి, అరేపల్లి సాంబశివరావు, నార్లపాటి రాములు, రామకృష్ణ, నర్రా రాకేష్, తదితరులు పాల్గొన్నారు.