నవతెలంగాణ – హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన టీడీపీ-జనసేన కూటమికి టాలీవుడ్ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రియమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ మతుకుమిల్లికి.. అత్త దగ్గుబాటి పురందేశ్వరికి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తారక్ రాసుకోచ్చాడు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024