ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ అదుర్స్..

నవతెలంగాణ-హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే ఓవర్సిస్ లో దీని ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఈ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ిశేషం. ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ డాలర్ల మార్క్ ను చేరిన భారతీయ సినిమాగా దేవర రికార్డును సృష్టించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయింది. కులం లేదు.. మతం లేదు. అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ ఎంట్రీ మామూలుగా లేదు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పే డైలాగ్ లు ప్రేక్షకులను అలరించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ ెప్పిస్తోంది. పని మీద పోయినోడు అయితే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టి ఉండాడు నీ కొడుకు అనే డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీన్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో పాటు జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం మొదలవుతుంది అనే డైలాగ్ తో ముగుస్తుంది ట్రైలర్. ఈ ట్రైలర్ ని చూస్తుంటే.. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డు నెలకొ్పేలా కనిపిస్తోంది.

Spread the love