ఒక శతాబ్దపు అద్భుతం ఎన్టీఆర్‌

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీర్‌తోపాటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు.
అలాగే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
నూటికో కోటికో ఒక్కరు. వందేళ్ళు కాదు.. చిరకాలం, కలకాలం మన మనసులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావి తరాలకు గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ములు ఎన్టీఆర్‌. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఆయనతో నా అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం.
– చిరంజీవి
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు
గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..
– ఎన్టీఆర్‌
తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, శక పురుషుడు. తెలుగువారి గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు.
– గోపీచంద్‌ మలినేని
తెలుగు జాతి.. తెలుగు సినిమా… మీకు ఎప్పుడూ రుణ పడి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన ఎన్టీఆర్‌కి జోహార్‌..
– హరీష్‌ శంకర్‌
ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారకరామారావు. గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనసు ఉన్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనికివే నా ఘన నివాళి.
– అనిల్‌ రావిపూడి

Spread the love