రాజకీయాల్లో నూతన విప్లవానికి నాంది పలికిన మహానాయకుడు ఎన్టీఆర్‌

– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ – కూకట్‌ పల్లి
కీ.శే. నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా, ఆదివారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ఎన్‌టీిఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా వివేకానందనగర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుఅర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ ఆవనికపై ఆవిష్కరించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని. ఆయన లాంటి యుగపురుషుడు మళ్లీ పుట్టబోరని.నేడు తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు సాధించింది అంటే ఆయన చేసిన కృషి ఫలితమెనని ఆయన కృషి మరువలేనిదని అలాగే రాజకీయాల్లో నూతన విప్లవానికి నాంది పలికిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ఆడపిల్లకి ఆస్తిలో సగం హక్కు ఉండాలన్న నీనాదం .సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులను రాజకీయాల్లో తీసుకొచ్చిన దర్శనికుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, మాధవరం రోజా దేవి రంగారావు, మాజీ కార్పొరేటర్‌ తూము శ్రవణ్‌ కుమార్‌ ,అభిమానులు కార్యకర్తలు తదితరులు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌.
ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు
కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని మూసాపేట్‌ డివిజన్‌లో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యుగపురుషుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కీ.శే నందమూరి తారక రామరావు శత జయంతి వేడుకలు మూసాపేట్‌ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో, గుడ్‌ షెడ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిó గా మల్కాజిగిరి పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఉప్పు రామ కృష్ణ పాల్గొని ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగు జాతినీ దశ దిశలా వ్యాపింప జేసిన మహానాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.అలాగే హెచ్‌ పి రోడ్డు లొ తూము సాగర్‌ పటేల్‌ ఆధ్వర్యంలో, భరత్‌ నగర్‌ కాలనీ లొ చందు యాదవ్‌ ఆధ్వర్యంలో, బాలాజీ నగర్‌ డివిజన్‌ వసుంధర ఆసుపత్రి దగ్గర కడెంపల్లి కృష్ణయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు తూము సాగర్‌, కడెంపల్లి కృష్ణయ్య గౌడ్‌, డివిజన్‌ మాజీ అధ్యక్షులు కొత్తపల్లి రాముగౌడ్‌, భరత్‌, చందుయాదవ్‌, బిక్షపతి యాదవ్‌ , గణపతి శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేశగుప్తా, అనిల్‌ , భూపాల్‌ రెడి,్డ శ్రీకాంత్‌ పూర్ణ, భాస్కర్‌ , మరియు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌
కార్పొరేటర్‌ విజయ శేఖర్‌ గౌడ్‌
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రంగారెడ్డి నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ బి. విజయ్ శేఖర్‌ గౌడ్‌ అన్నారు.ఆదివారం ఎన్టీఆర్‌ జయంతి పురస్కరించుకొని డివిజన్‌ పరిధి ఆదర్శనగర్‌ చౌరస్తాలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ కార్పొరేటర్లు బొడ్డు వెంకటేశ్వరరావు, కేఎం గౌరీష్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కే. జయరాం తోపాటు టిడిపి, బిఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజకీయ రంగంలో, సినీ రంగంలో మకుటం లేని మహారాజుల వెలిగిన ధ్రువతార ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు అడుగుజాడల్లో నడిచినప్పుడే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జల్దా లక్ష్మీనాథ్‌, బాలు నేత సత్తిరెడ్డి, యాదవ రెడ్డి, నాంచారమ్మ, తో పాటు టిడిపి ,బిఆర్‌ఎస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love