తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్…

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు.మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు స్వగ్రామం డిచ్ పల్లి మండలం లోని ధర్మారంబీ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అదివారం ధర్మారం బి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అభిమానులు మహా అన్నదాన కార్యక్రమాని చేపట్టారు . ఈ సందర్భంగ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు వారి గొంతును దిల్లీ పీఠం వరకు వినిపించేలా పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలలోనే అధికారంలో నిలిపి తనదైన ముద్రను వేసి, విలువలు ఉన్న రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అన్నారు. నేడు ఆ యుగపురుషుని శతజయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని సూచించారు.ఎన్టీఅర్ చేసిన సేవలను చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని వివరించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, మళ్లీ ఎన్టీఆర్ జన్మించి ఈ తెలుగు గడ్డపై తన పరిపాలన కొనసాగించాలని, తెలుగు ప్రజల మదిలో మెలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love