తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్

– టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి
నవతెలంగాణ- పెద్దవంగర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆరాధ్య దైవం అని టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి అన్నారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నందమూరి తారక రామారావు సేవలు చిరకాలం ఆంధ్రుల గుండెల్లో పదిలంగా ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి, తెలుగు ప్రజలకు అవినీతి లేని పాలన అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు శనిగరం ఏకాంబ్రం, సీనియర్ నాయకులు పాశం యాకయ్య, సోమ వీరన్న, మహిపాల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love