నవతెలంగాణ – హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘దేవర’ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి, ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తారక్ ధన్యవాదాలు తెలిపారు. “దేవర సినిమా విడుదల కోసం కొత్త జీవోను తీసుకువచ్చినందుకు, తెలుగు సినిమాకు నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు కూడా కృతజ్ఞతలు” అని తారక్ ట్వీట్ చేశారు.