నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామంలో సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సమక్షంలో మేకల శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సుమారు 50 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు . ఈ సందర్భంగా కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందని, గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ విజయ డంకా మోగిస్తుందని చెప్పారు. బి జెపి లో చేరిన వారిలో మేకల కొండల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి ,వేణుగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ,వంగరి రమేష్, వంగరి నరేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు దీనదయాల్, యాదగిరి, హనుమంతు, దేవేంద్రర్, బండారు సత్యనారాయణ, యల్. కిరణ్ , కోమ్ము నవీన్ యూదవ్, తదితరులు పాల్గొన్నారు.