జ‌ల్లిక‌ట్టుకు ఓకే చెప్పిన సుప్రీం…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: జ‌ల్లిక‌ట్టు క్రీడ‌కు సుప్రీంకోర్టు ఓకే చెప్పేసింది. జంతువుల్లో క్రూర‌త్వ నివార‌ణ చ‌ట్టానికి త‌మిళ‌నాడు స‌ర్కార్ చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్ధించింది. కేఎం జోసెఫ్‌, అజ‌య్ ర‌స్తోగీ, అనిరుద్ద బోస్‌, హృషికేశ్ రాయ్‌, సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. జ‌ల్లిక‌ట్టు క్రీడ‌లో భాగ‌మైన బ‌ర్రెలు, ఇత‌ర ప‌శువుల‌కు అవ‌స్థ‌లు, నొప్పి త‌గ్గించేందుకే త‌మిళ‌నాడు స‌ర్కార్ జంతు చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేసిన‌ట్లు కోర్టు తెలిపింది. ఆ స‌వ‌ర‌ణ‌ల‌ను ఆమోదిస్తూనే.. జ‌ల్లిక‌ట్టు క్రీడ‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. జ‌ల్లిక‌ట్టు అంశంలో త‌మిళ‌నాడు స‌ర్కార్ తీసుకున్న చ‌ర్య‌ల్లో లోపాలు లేవ‌ని కోర్టు చెప్పింది. అది సాంప్ర‌దాయ క్రీడ అని, రూల్స్ ప్ర‌కారం ఆ క్రీడకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. క‌ర్నాట‌క‌లో జ‌రిగే కంబాలా, మ‌హారాష్ట్ర‌లో జ‌రిగే బుల్ కార్ట్ రేసింగ్‌ల‌కు కూడా సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

Spread the love