నవతెలంగాణ-గోవిందరావుపేట
గోదావరి జనాలను లక్నవరం సరస్సుకు తరలించి జలాశయంగా ఉంచి రెం డు పంటలకు నీరు అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.శనివారం మండలంలోని లక్నవరం సరస్సును కాంగ్రెస్‌ జిల్లా నూతన అధ్యక్షులు పైడాకుల అశోక్‌తో కలిసి మండల ముఖ్య నాయకులతో సందర్శించారు. ఈ సందర్భంగా సితక్క మాట్లాడుతూ లక్నవరం సరస్సు చాలా అందమైన సరస్సు అని, చుట్టూ కొండలతో నిండైన జలాశయంతో అత్యంత రమణీయంగా ఉంటుందని, అందుకే సందర్శకులను నిత్యం ఆకట్టుకుంటూ ఎప్పుడు సందడి, సందడిగా ఆకర్షణీయం గా ఉండే లక్నవరం సరస్సు ఈరోజున వెల, వెలబోతు పూర్తిగా ఎండిపోయి, జలా శయంలాగా లేక దారుణమైన స్థితిలో ఉందని, లక్నవరం సరస్సు కింద సుమారు గా 7000 ఎకరాల పైగా ఎకరాల్లో వరి పంటకు సాగు నీరు అందిస్తున్నది అని, అలాంటి సరస్సు ఇవ్వాళ వెల, వెల పోవడం విచారకరం అని అన్నారు గత కొన్నేం డ్ల నుండి లక్నవరం సరస్సు జలాశయం నీరు లేక ఎండిపోయిన స్థితి లేదని అ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్సులకొరకు మిషన్‌ కాకతీయ లాంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చిన లక్నవరం సరస్సుకు ఎటువంటి లాభం జరగలేదని అన్నారు. గోదా వరి జలాలను సరస్సుకు అందించి నిరంతరం రిజర్వాయర్‌ లాగా మార్చి పర్యాట కులకు రైతులకు పంటలు పండించుకునే విధంగా మార్చాలని అన్నారు. 13వ శ తాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ లక్నవరం చెరువు లీకేజీలను కూడా అరిక ట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికి అయిన ప్రభుత్వం మేల్కొని ఎన్నో వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్న పాకాల, రామప్ప, ఇంచిచెర్వుపల్లి, ఘన పురం, మల్లూరు, లక్నవరం సరస్సులకు గోదావరి జలాలను తరలించి రైతులను ఆదుకోవాలని, పర్యాటకుల కొరకు ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఆకట్టుకోవాలి అని ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎల్‌డిఎం ఆర్గనైజింగ్‌ కా ర్యదర్శి డా.అనిల్‌ కుమార్‌, మహాబాద్‌ పార్లమెంటు కో-ఆర్డినేటర్‌ మార్క విజరు, టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్‌ గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవిచందర్‌, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్‌ పూజారి సురేందర్‌, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌ రెడ్డి, ఇరుసవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు ఎండి.చాంద్‌ పాషా, బొల్లు దేవేందర్‌, చిటమట రఘు, ఎండి. అఫ్సర్‌ పాషా, మైల జయరాం రెడ్డి, వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, వర్కింగ్‌ ప్రెసిడెం ట్లు, ఆకుతోట చంద్రమౌళి, నల్లెల్ల భరత్‌, బండి శ్రీనివాస్‌, రసపుత్‌ సీతారాంనా యక్‌, గాదరి కిషోర్‌, గౌరవ అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, సహకార సంఘ అ ధ్యక్షులు బొక్క సత్తిరెడ్డి, పన్నాల ఎల్లారెడ్డి, పులి సంపత్‌, ఎంపీపీ బానోత్‌ విజ య-రూప్‌ సింగ్‌, జడ్పీటీసీ ఈసం రమ-సురేష్‌, ఎంపీపీ సువర్ణపాక సరోజన- జగ్గారావు, వైస్‌ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, ఉమ్మనేని రమేష్‌, చింతనిప్పుల భిక్షపతి, వంగ రవి, యూత్‌ మండల ఉపాధ్యక్షులు ఈసం అశోక్‌, ఎస్‌.కార్తీక్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love