ప్రభుత్వం వెంటనే ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలి


నవతెలంగాణ- అర్వపల్లి
ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదవారికి ఇవ్వాలని భూ పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) నాయకుడు మట్టిపల్లి సైదులు పై అక్రమ దాడి చేసిన ఎస్సైని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎం సి పి ఐ యు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఈదుల వీర పాపయ్య అన్నారు డిమాండ్‌ చేస్తుంది మీకు ఇచ్చిన అధికారం దుర్యోగం చేస్తూ పేదల కోసం పోరాటం చేస్తున్న ఓ నాయకుడిపై అసభ్యంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే ప్రభుత్వ స్పందించి వెంటనే సస్పెండ్‌ చేయాల్సిందిగా అతనికి కఠిన శిక్ష విధించాల్సిందిగా ఎంసిపిఐ యు తుంగతుర్తి డివిజన్‌ డిమాండ్‌ చేస్తుంది తక్షణమే సస్పెండ్‌ చేయని యెడల సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు. చేస్తామని అతన్ని సస్పెండ్‌ చేసిందాకా సహించేది లేదని ఉన్నారు ఆయన వెంట ఎం సిపిఐ నాయకులు ఉన్నారు..
సూర్యాపేట:మోతే మండలం విభళా పురం గ్రామంలో శుక్రవారం డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్లు ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం నాయకులు గోపాల్‌ రెడ్డి పైన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పైన పోలీసులు దాడి చేయటాన్ని ప్రజలందరూ ఖండించాలని బాధ్యులపై చర్య తీసుకోవాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి డిమాండ్‌ చేశారు.శనివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విబలాపురం గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు ఏకపక్షంగా చేశారని అర్హులైన పేదలకు అందటం లేదని లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదని వీరబోయిన రవి అన్నారు. సామరస్యంగా ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల పైన పోలీసులు దాడి చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకుల ప్రోత్సాహం తోనే పోలీసులు దాడికి పాల్పడ్డారనిమర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని అర్హులైన పేదల లిస్టు ఫైనల్‌ చేసి వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంచుగొట్ల శ్రీనివాస్‌ ,సూర్యాపేట పట్టణ కార్యదర్శి గోపనబోయిన రవి, జిల్లా నాయకులు చింతల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల :శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రజలపై పోలీసులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌మండల సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ వీరబోయిన మహేష్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోతె మండలం విభలాపురం గ్రామంలో మొదట ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసిన లబ్దిదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు ఎంపిక చేసిన వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులుపై ,మహిళలల పై దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐ మహేష్‌ను తక్షణమే సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు.
తిరుమలగిరి:వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించాలని, ఎస్‌ఐని విధుల నుండి తొలగించాలని జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్‌ చేశారు.మండలకేంద్రంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మోతె మండలం విభాల పురం గ్రామంల డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని పోరాటం చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం మట్టిపల్లి సైదులు పై , అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులను పోలీసులు మరియు ఎస్‌ఐ కర్రలతో కొట్టి వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టిన ఎస్సైని విధులు నుండి తక్షణమే తొలగించాలన్నారు. ప్రభుత్వం డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, ఇంటికో జాబ్‌ ఇస్తామని, నిరుద్యోగ భతి కల్పిస్తామని మరి ఎన్నో వాగ్దానాలు చేసిన బీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేటికీ వారి వాగ్దానాలు అమలు చేయడంలేదన్నారు. పేదల కోసం పోరాటం చేస్తున్న నాయకులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌చేశారు.
నూతనకల్‌: మోతె మండలం విభళ పురం గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గోపాల్‌ రెడ్డి, నాయకుల పైన పోలీసులు మూకమ్మడిగా దాడి చేయటాన్ని ప్రజలందరూ.ఖండించాలని బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా కమిటి సభ్యుడు కందాల శంకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ లబ్దిదారుల ఎంపికలో అధికారులు ఏకపక్షంగా చేశారని అర్హులైన పేదలకు అందడం లేదన్నారు. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు .స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోత్సాహం తోనే పోలీసులు దాడికి పాల్పడ్డారన్నారు. సీపీఐ(ఎం) నాయకుల పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు సామ సురేందర్‌ రెడ్డి, బొజ్జ శీను ,నగేష్‌ రెడ్డి, అంజపల్లి లక్ష్మయ్య, లింగయ్య, రవి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
మోతె : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పై మండల కార్యదర్శి ముల్కూరు గోపాల్‌ రెడ్డిపై జరిగిన దాడిని నడిగూడెం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు వీరబోయిన మహేష్‌ యాదవ్‌ శనివారం వేరువేరు ప్రకటనలో ఖండించారు శనివారం వారు వేరువేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల అక్రమాలపై అవినీతిపై పేదలకు మద్దతుగా నిలిచిన నాయకులపై పేదల లబ్ధిదారు లైన మహిళలపై ఎస్సై మహేష్‌ దాడి నీచమైందన్నారు వెంటనే పై అధికారులు జోక్యం చేసుకుని వెంటనే సస్పెండ్‌ చేయాలని లేనియెడల జిల్లా వ్యాప్తంగా వేరువేరు రూపాలలో ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love