ఏసీబీ విజిలెన్స్ దాడులను స్వాగతిస్తున్నాం..

– దాడులే కాదు నిజాలు నిగ్గు తేల్చి అవినీతి వీసి నీ, సహకరించిన అవినీతి, అక్రమార్కులను భర్తరఫ్ చేయాలి
– తెలంగాణ యూనివర్సిటీపిడిఎస్ యూ కమిటీ డిమాండ్
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఏసీబీ విజిలెన్స్ అధికారులు యూనివర్సిటీలో జరిగిన అవినీతి ,అక్రమాలు కొనుగోళ్ల కుంభకోణాలపై విచారణ జరిపినటువంటి దాడులను పిడిఎస్యూ తెలంగాణ యూనివర్సిటీ స్వాగతిస్తుందని అదే సందర్భంలో దాడులే కాదు, ఈ అవినీతి అక్రమాలు విచ్చలవిడి కొనుగోలు కుంభకోణానికి బాధ్యుడైన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తాను, ఆయనకు సహకరించిన అధికారులను యూనివర్సిటీ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ అధ్యక్షులు సంతోష్ విలేకరుల తో మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా అక్రమ నియామకాలు, అవినీతిపైన, అడ్డగోలుగా కొనుగోళ్ల కుంభకోణాలపై మంగళవారం జరిగిన ఏసీబీ విజిలెన్స్ దాడులను విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నా మన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవినీతి అక్రమాలు చేయకపోతే ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుగుతుంటే భయపడి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఏ స్థలమైన మేము వస్తాము మీ అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైస్ ఛాన్సలర్ కు సవాల్ విసిరారు.ఏసీబీ విజిలెన్స్ దాడులు జరపడమే కాదని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి , నిజ నిజాలు నెగ్గు తేల్చి వీసీ పై ,ఈ అవినీతి అక్రమాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేకపోతే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, శివ సాయి, అశ్విత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love