రేపు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం

నవతెలంగాణ హైదరాబాద్‌: మెగా ఇంట పెండ్లి బాజాలు మోగనున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెండ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా ‘మిస్టర్’ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

Spread the love