సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల్లో అధికారులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మే 28న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ – 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది.

Spread the love