నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ల (స్టాఫ్ నర్సుల) ఎంపిక పరీక్షను నవంబరు 23వ తేదీ నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. మొదట కంప్యూటర్ ఆధారిత ఎంపిక పరీక్షను నవంబరు 17న నిర్వహిస్తామని ప్రకటించగా తాజాగా ఆ తేదీని నవంబరు 23కు మార్చినట్లు తెలిపింది.