నర్సింగ్‌ విద్యార్థిని మృతి.. కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన

నవతెలంగాణ – భద్రాచలం: నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో పారా మెడికల్‌ కళాశాల వద్ద శుక్రవారం బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

Spread the love